![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఇందులోకి వెళ్ళాలంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో సెలక్ట్ అవ్వాల్సిందే. అయితే ఇందులో నుండి కేవలం హౌస్ లోకి అయిదుగురు ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతం అగ్నిపరీక్షలో పదిహేను మంది ఉన్నారు. జడ్జులుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ ఉన్నారు.
హౌస్ లో పెట్టే టాస్క్ లే అగ్నిపరీక్షకి పెడుతున్నారు. ఆ పదిహేను మంది జడ్జులకి చుక్కలు చూపిస్తున్నారు. టాస్క్ లో ఎవరు పర్ఫెక్ట్ లేరు.. ఇంకా టాస్క్ చెప్పేది వినడం లేదు.
అగ్నిపరీక్షలో ఎన్ని మెలికలు పెడుతున్నారు. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అవి అర్థం చేసుకోలేక తల పట్టుకుంటున్నారు. నవదీప్ దగ్గర నాలుగు ఎల్లో కార్డ్స్ ఉన్నాయ్.. కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ని బట్టి అవి ఇస్తున్నాడు.. ఇక పర్ఫామెన్స్ బాగుంటే స్టార్ ఇస్తూ అభినందినస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ ఎవరు కూడా తమకిచ్చిన టాస్క్ ని సీరియస్ గా తీసుకోవడం లేదని నవదీప్ వాళ్లపై కోప్పడ్డాడు. హౌస్ లో ఎలా ఉంటుందో మిమ్మల్ని ట్రైన్ చేసి పంపిద్దామనుకుంటే.. మీరేం అసలు పట్టనట్లే ఉన్నారు.. ఈ మాత్రానికే ఈ షో సెటప్ ఎందుకు.. నేను వెళ్తున్నానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మిగతా ఇద్దరు కూడా అలానే వెళ్ళిపోతారు. కాసేపటికి శ్రీముఖి కూడా వెళ్ళిపోతుంది.
మరొక ఎపిసోడ్ లో శ్రీముఖి వచ్చి.. నేను ఫస్ట్ టైమ్ నా కెరీర్ లో షోలో బై చెప్పకుండా వెళ్ళిపోయాను.. కేవలం మీ వల్లే అంత చిరాకు తెప్పిస్తున్నారు. ఇప్పుడు మీ పర్ఫామెన్స్ కి జడ్జులు రావడానికి సిద్ధంగా లేరు అని శ్రీముఖి కంటెస్టెంట్స్ కి చెప్తుంది. జడ్జెస్ రావాలంటే మీరు నాకు ముందు ప్రామిస్ చెయ్యాలి.. టాస్క్ లు బాగా ఆడి మంచిగా పర్ఫామెన్స్ ఇస్తానని శ్రీముఖి అనగానే కంటెస్టెంట్స్ ప్రామిస్ చేస్తారు.
![]() |
![]() |